ఎవ్వాని వాకిట యిభ మద పంకమ్ము
రాజ భూషణ రజో రాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్ల లోకములకు
ఒజ్జయై వినయమ్ము నొరపు గరపు
ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడు వారాసుల
కడపటి కొండపై కలయ బ్రాకు
అతడు భూరి ప్రతాప మహా ప్రదీప దూర
విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర
మణి ఘ్రుణి వేష్టి తాంఘ్రి తనుడు
కేవల మర్త్యుడే ధర్మ సుతుడు
- మహా భారతంలో ధర్మ రాజు గుణ గణాలను తెలియ జేసే పద్యం