కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతి కేళి జిహ్వకున్
వంటక మించునే యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునే మానుషమ్ము గలట్టి మనుష్యున కెట్టి వానికిన్
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు కల్గినన్
- కాశీ ఖండంలో వింధ్య పర్వత మనస్థితి వర్ణిస్తూ శ్రీ నాధుడు రాసిన పద్యం