కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి
గగన భాగంబెల్ల గప్పికొనగ
ఉరికిన నోర్వక ఉదరమ్ము లోనున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రమ్ము చేపట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నా లావు నగుబాటు సేయకు
మన్నింపు మని క్రీడి మరల దిగువ
కరికి లంఘించు సింహమ్ము కరణి మెరసి
నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యంచు మద్విశిఖ వృష్టి
తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు
- భాగవతములో భీష్మ స్తుతి (అమ్మకి చాల యిష్టమైన పద్యం)