ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

28, జులై 2011, గురువారం

సమస్యపూరణ

చేవ నొసంగ జాతికిని జీవ మోసంగగ బండరాతికిన్
సేవ నొసంగ కోతికిని శిక్ష నొసంగగ చుప్పనాతికిన్
దేవ మునీంద్ర శాపముల్ దీరిచి ముక్తి పదమ్మొసంగగ
రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టె గుణాభి రాముడై

రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టె గుణాభి రాముడై - అన్న సమస్యకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పూరణం