ఖండేన్దు మౌళిపై కలహంస పాళిపై
కర్పూర దూళిపై కాలు ద్రవ్వు
మిన్నేటి తెరలపై మించు తామరలపై
మహి మంచు నురులపై మల్లరించు
జంభారి గజముపై చంద్రికా రజముపై
చందన ధ్వజముపై చౌకళించు
ముత్యాల సరులపై మొల్ల క్రొవ్విరులపై
ముది కల్ప తరులపై మోహరించు
వెండి మల ఎక్కి శేషాహి వెన్ను దన్ని
తొడరి దుగ్దాబ్ది తరగల తోడ నడరి
నెరతనం బాడి నీ కీర్తి నిండె నహహా
లక్షణో పేంద్ర దేవరాయ క్షితీన్ద్రా
- కర్ణాట రాజ్య సభలో కనకాభిషేక వేళ శ్రీ నాధుడు పలికిన పద్యం