ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భ్రుత్యులై
వరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండమా
కారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుసన్ నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా
- పోతన రాసిన నారాయణ శతకములోని యీ పద్యం, మా చిన్నప్పుడు అమ్మ నేర్పగా, దసరా బాణాలు పట్టుకొని పాడే వాళ్లము. దసరాకి బాణాలు పట్టుకొని తిరిగిన ఆఖరి తరం పిల్లలం మేమే మా వూళ్ళో. ఆ తరవాత ఆ సాంప్రదాయం అంతరించిపోయింది.