బృందారక శ్రేణి వందారు యజునకు
మురిపంబు గరిపేటి ముద్దుగుమ్మ
సంగీత సాహిత్యసకల విద్యలు నేర్ప
ఫలవంతమైనట్టి పంతులమ్మ
కర పల్లవ ద్వయి స్వర వీణ పుస్తక
ముల దాల్చి వరలెడి పూవు కొమ్మ
ముగురమ్మలందున ముఖ్యురాలయినట్టి
రమణీయ రమణి సరస్వతమ్మ
యజుని అంకాన రత్న సింహా సనమున
నిండు కొలువుండి సకల బ్రహ్మండములను
తాన పరిపాలనము చేయు తలిరుబోడి
చెలగి విహరించు గాక నా కలము తుదను