సమస్య: చెడు పేరున్నది మిత్రమా ప్రజలలో శ్రీ శ్రీ కవిత్వానికిన్
నా ప్రయత్నం: మత్తేభం
కడు దీనాత్ముల బాధలున్ తనవిగా కారుణ్య భావమ్ముతో
బడ బానానల రీతి రెగేడు వచో పారిణతన్ ధీరతన్
చెడు పై యెత్తిన రక్త కేతనముగా జేగీయమైనట్లు తో
చెడు పేరున్నది మిత్రమా ప్రజలలో శ్రీ శ్రీ కవిత్వానికిన్