ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

2, నవంబర్ 2011, బుధవారం

హృద్యమైన పద్యం

మత్స్యమై యెవ్వాడు మడియించె సోమకు?
       గూర్మమై ధరియించె గుధర మెవడు?
పందియై యెవ్వాడు బరిమార్చె  గనకాక్షు?
       సింగమై కశిపుని జీరె నెవడు?
వడుగయి యెవ్వాడు బలి సంపద హరించె?
       ద్విజుడయి నృపుల మర్దించే నెవడు? 
రాముడై యెవ్వాడు రావణు గడ తెర్చే?
       బల భద్రుడై పూనె హలము నెవడు ?

బుద్ధుడై బౌద్ధ మత మెవ్వ డుద్ధరించే?
గల్కియై యెవ్వాడు కలి శిక్షణ మొనర్చె?
నట్టి విష్ణుని వితత దశావతారు 
జేరి రక్షింపు మనుచు జోహా రొనర్తు

- తిరుపతి వెంకట కవులు