నన్నయ సంతర్పణము జేసే కమ్మని
యాంధ్ర భాషగా సుభోజ్యమ్ము లెలమి
తద్భోజ్యములకు నూతన రుచుల్గల్గించి
చక్కగా వడ్డించే తిక్కయజ్వ
తిక్కన న్వీక్షించి ,తెలుగు వారికి లౌక్య
సంతర్పణము చేసే సార్వభౌము,
డాతని వీక్షించి అపురూపమగు వస్తు
తతి గూర్చి పంచె పెద్దన్న గారు
నవ్య నవరస భోజనమున దనిసి
తక్క కవులెల్ల రాతని ఫక్కి ద్రొక్కి
రట్టి వారల సేవ సేయంగ తలుతు
హాని అన్యుల నే గొల్వ గాచితేమి