ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు

11, ఆగస్టు 2011, గురువారం

హృద్యమైన పద్యం

భీష్ముని పైకి కుప్పించి లంఘించు గో
            పాల కృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు
            ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరంబు గావించు సత్య కన్నుల నుండి 
             వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ 
             సందు మాగాయ పచ్చడి పసందు

ఎపుడు కనుగొంటివయ్యా! నీ కెవరు చెప్పి
రయ్యా! ఏ రాత్రి కలగంటివయ్య ! రంగు
కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు
సహజ పాండితి కిది నిదర్సనమటయ్య !

- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి