పంచమ స్వరం
పంచమ స్వర మాలపించే మావి గుబురున మత్త కోకిల - చైత్ర లక్ష్మిని స్వాగతించే నా హృదంతర సీమలా
ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు
15, మార్చి 2013, శుక్రవారం
22, సెప్టెంబర్ 2012, శనివారం
14, జూన్ 2012, గురువారం
13, ఏప్రిల్ 2012, శుక్రవారం
పోతన పద లాలిత్యం
మెరగు చెంగట నున్న మేఘంబు కైవడి
ఉవిద చెంగట నుండ నొప్పు వాడు
చంద్ర మండల సుధా సారంబు పోలిక
ముఖమున చిరునవ్వు మొలచువాడు
వల్లీ యుత తమాల వసుమతీజము భంగి
పలు విల్లు మూపున వరగువాడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి
ఘన కిరీటము తల గల్గువాడు
పుండరీక యుగము బోలు కన్నులవాడు
వెడద యురము వాడు విపుల భద్ర మూర్తి
వాడు రాజ ముఖ్యు డొక్కరుడు నా
కన్నుగవకు నెదుర గాన బడియె
- పోతన భాగవతము
లేబుళ్లు:
పోతన పద లాలిత్యం,
హృద్యమైన పద్యం
16, మార్చి 2012, శుక్రవారం
దత్తపది
మార్చి, కూర్చి, ఆర్చి, వార్చి - ఈ పదాలతో భాగవతార్ధములో దత్తపది - నా ప్రయత్నం :
హరి! యేమార్చితి వీవు బాలకునిగా హాసమ్ముతో యెల్లరన్
మురళీ గానము నందు కూర్చితివిగా మోహంపు జీవాత్మలన్
కరుణా మూర్తివి గాను ఆర్చితివిగా కౌంతేయు లాపన్నతల్
పరమాత్మా! సరి వార్చి యున్న నను నీ పాదమ్ములన్ జేర్పవే
(వార్చి యుండుట = వేచి యుండుట అని అర్ధం)
హరి! యేమార్చితి వీవు బాలకునిగా హాసమ్ముతో యెల్లరన్
మురళీ గానము నందు కూర్చితివిగా మోహంపు జీవాత్మలన్
కరుణా మూర్తివి గాను ఆర్చితివిగా కౌంతేయు లాపన్నతల్
పరమాత్మా! సరి వార్చి యున్న నను నీ పాదమ్ములన్ జేర్పవే
(వార్చి యుండుట = వేచి యుండుట అని అర్ధం)
8, నవంబర్ 2011, మంగళవారం
సొంత కపిత్వం
యోహాను, మేరి, ఏసోబు, బెత్లహాం - ఈ పదాలతో "కరుణ నేలకు దిగివచ్చిన శుభ వేళ క్రీస్తు సందేశాన్ని" నచ్చిన ఛందస్సులో రాయాలి. పై దత్తపదికి నేను చేసిన ప్రయత్నం:
వర యోహాను సువార్త సత్యమగుచున్ విశ్వమ్ము హర్షింపగా
పరి శుద్దాత్మను గర్భ మందిన మహా పుణ్యాంగనౌ మేరికిన్
సరి యేసోబున కుద్భ వించె భువిలో సత్యమ్ము మార్గమ్ముగా
కరుణా సింధువు బెత్లహాం పురమునన్ కైమోడ్పులందింపుడీ
హృద్యమైన పద్యం
జారుల జూచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో
- ఈ సమస్యకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పూరణ:
కోరిక దీర మ్రొక్కుకొని కొండ పయిన్ శివ రాత్రి నాడు జా
గారము చేసి దీపముల కాంతులలో నవ వారి పూర గో
క్షీర మధు ద్రవాల నభిషేక మొనర్చెడి స్వామి వారి పూ
జారుల జూచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)