కాకర, మతాబు, భూచక్రం, చిచ్చుబుడ్డి - ఈ పదాలతో శ్రీ కృష్ణ రాయబార వర్ణన - నా ప్రయత్నం
కులమున్ గాచెడు సంధి గాక రణమున్ కోరేటి దుర్బుద్దికిన్
ఫలమున్ దప్పదు కౌరవేంద్ర సమతా బుద్ధిన్ వర్తింపుమా
చలమున్ పూనిన పార్ధు బాణ హతికిన్ ఛుల్లౌను భూచక్రమే
జలమున్ రేగేడు చిచ్చు బుడ్డి పడవన్ ఛిద్రమ్ము గావింపదే