అతి రహస్యంపు సంగతికి దాళపు పెట్టె
మంచి చెడ్డలకు జూపించు త్రోవ
కాలయాపనకు జక్కని యుపాయం బమి
త్ర ద్వంసమునకు ఫిరంగి గుండు
ఘన కార్యములకు బెట్టిన పేరు దారిద్ర్య
భంజనమ్మునకు దుపాకి దెబ్బ
యాపన్నివారణ కౌషధ ప్రాయమ్ము
తులలేని సుఖ దుఃఖములకు ద్రాసు
ఆత్మ సంరక్షణమున కిమ్మైన కోట
సంశయమ్మునకు వినాశ సమయ మరయ
సకల లోకోపకారంబు సలుపు సుజన
మైత్రి కన్నను వేరొండు మహిని కలదె
- తిరుపతి వెంకట కవులు (శ్రవణానందము కావ్యములోనుంచి)