అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగముస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్
రామాయణ కల్ప వృక్షం లో అవతారికలో ఈ పద్యం చాలా ప్రసిద్ధమైంది. నన్నయకు, తిక్కనకు లేనటువంటి భోగము గురువర్యులైన చెళ్ళపిళ్ళ వారికి తన శిష్యరికం వల్ల కలిగిందని చెప్పుకున్నారు. వారికీర్తిని దేశమంతట వ్యాపించుటకు తన శిష్యరికమే కారణం అన్నాడు. ఇది మనకు అహంకారంగా కనిపిస్తుంది. అది ఆయన ఆత్మవిశ్వాసం మాత్రమే.